Fast Tollywood
🔥 Updates
Loading...

🔥 Latest Updates

Pages

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "గాలి" చిత్రం ఈ నెల 17 న గ్రాండ్ రిలీజ్

 

సంధ్య ఫిలిమ్స్ బ్యానర్‌పై రాంప్రసాద్ గురజాడ, అంజలి రామవతు, శ్రీకాంత్ పెరుమండ్ల, ఎస్. చంద్రకళ, చందా రోజారాణి, బి.వి. సుబ్బారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో-ఫాంటసీ చిత్రం “గాలి”. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పొందిన, నంది మరియు గరుడ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న తీడ రాము ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిర్మాతగా చందా లక్ష్మీనారాయణ వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని పనులు ముగించుకుని ఈ నెల 17న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత చందా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, “సినిమా రంగంలో నాకు ఇది కొత్త ప్రయాణం. అయినప్పటికీ రాము గారు రాసుకున్న సోషియో-ఫాంటసీ కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాను. మా అంచనాలకు మించి సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ నెల 17న విడుదలవుతున్న ‘గాలి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు. దర్శకుడు తీడ రాము మాట్లాడుతూ, “కలి పురుషుడు మరియు అమ్మవారి మధ్య జరిగే భీకర పోరాటం నేపథ్యంలో సాగే కథే ‘గాలి’. సస్పెన్స్‌తో నిండిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషియో-ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది” అని తెలిపారు. సినిమా వివరాలు: సినిమా పేరు: గాలి నటీనటులు: రాంప్రసాద్ గురజాడ, అంజలి రామవతు, శ్రీకాంత్ పెరుమండ్ల, ఎస్. చంద్రకళ, చందా రోజారాణి, బి.వి. సుబ్బారెడ్డి తదితరులు బ్యానర్: సంధ్యా ఫిలిమ్స్ నిర్మాత: చందా లక్ష్మీనారాయణ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తీడ రాము ఎడిటర్: వేణు చౌదరి సినిమాటోగ్రఫీ: కే. ప్రకాష్